VZM: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అవసరమైన అత్యవసర పనులకు వెంటనే ఆమోదం పొంది, పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఛాంబర్లో అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా విద్యుత్ వైరింగ్ చేయాలని, వాటర్ పైప్ లైన్ లీకేజీ లేకుండా అరికట్టాలని, డ్రైనేజీ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.