PDPL: ధర్మారం మండలం మేడారంలో సర్పంచ్ మేడారం వీర్పాల్ ఇవాళ సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. స్థానిక 5వ వార్డులో సీసీ జనరల్ ఫండ్ నిధులు రూపాయలు 2.5 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దశలవారీగా గ్రామంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.