ATP: గుంతకల్ నియోజకవర్గానికి చెందిన మహిళలు ఇవాళ జనసేన పార్టీలో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టి.సి.వరుణ్ సమక్షంలో ఎం.రాజేశ్వరితో పాటు పలువురు మహిళలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఆశయాలు, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.