లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లు తడబడ్డారు. దీంతో KKR.. 155/7 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగాడు. కోల్కతా బ్యాటర్లలో రింకూ సింగ్ (83*) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. గ్రీన్ 34 పరుగులు చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఆఖరి ఓవర్లో రింకూ 4 వరుస సిక్సర్లతో విరుచుకుపడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.