PDPL: రామగుండం స్వీయ గణన అవకాశాన్ని వినియోగించుకుని జనాభా లెక్కల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సెన్సస్ అధికారులతో కలిసి స్వీయ గణన ప్రారంభించారు. జనాభా లెక్కల ఆధారంగానే నిధులు, అభివృద్ధి పనులు అమలవుతాయన్నారు. ఏప్రిల్ 26-మే10 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ధృవీకరిస్తారన్నారు.