MHBD: జిల్లాలో శాంతిభద్రతల బలోపేతమే లక్ష్యంగా SP డా. శబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కురవి, మరిపెడ, బయ్యారం వంటి కీలక స్టేషన్లకు కొత్త అధికారులను నియమించగా.. మరికొందరిని CCS, DCRB విభాగాలకు బదిలీచేశారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.