NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని పార్టీ సీనియర్ నాయకుడు సురేష్ బాబు, గుర్రప్ప కలిసి ఘనంగా ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు అన్నారు. అనంతరం చలివేంద్రం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.