AP: BJPతో జగన్ అక్రమ పొత్తు తేటతెల్లమైందని PCC చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘జగన్కు రాజ్యాంగ పరిరక్షణ కంటే BJP భజనే ముఖ్యమా? NDA పక్షాన నిలబడిన జగన్ సిగ్గుపడాలి. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? ఇదేనా మీరు చెప్పే YSR ఆశయాలు, వారసత్వం? దక్షణాది భావోద్వేగాలను అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం. జగన్ చేసిన నీచపు పనికి YSR ఆత్మ నిజంగా ఘోషిస్తుంది’ అని అన్నారు.