TG: రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రుణమాఫీ అంతా బోగస్ అని విమర్శిస్తూ.. మీరు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ చర్చ కోసం ఖమ్మం జిల్లాలో ఎక్కడికైనా రావడానికి తాను సిద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.