BCCI సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ జట్టుకు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు. గతేడాది అతడిని కలిసినప్పుడు ‘నన్ను క్షమించు’ అని అడిగినట్లు పేర్కొన్నాడు. కావాలని తాము నిర్ణయం తీసుకోలేదని.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్రౌండర్లను తీసుకోవాలని భావించినట్లు వెల్లడించాడు.