MBNR: మే 3న జరగనున్న నీట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 12 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.