SKLM: మందస మండలం ఉమాగిరి అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వడ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వై. వెంకటరమణ గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. 0–2సం పిల్లలకు సరైన పోషణ అందిస్తే మెదడు అభివృద్ధి బాగుంటుందని తెలిపారు. ప్రీ స్కూల్ పిల్లలు పాము కాటులు, వీధి కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండాలని సీడీపీవో పి. అరుణ సూచించారు.