TPT: తిరుపతి జిల్లా కపుగున్నేరిలో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (వాహన ఫిట్నెస్ సెంటర్)ను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో వాహనాల పరీక్షలు నిర్వహించడం ద్వారా రోడ్డు భద్రత మెరుగవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.