GDWL: గద్వాల్ పట్టణంలో ఈ నెల 12న జరిగిన గొల్ల వీరేంద్ర హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో DSP మొగలయ్య వివరాలు వెల్లడించారు. చెత్త సేకరణ ఆదాయం వివాదంతో శ్రీనివాసులు, సిద్దయ్యలు పథకం ప్రకారం వీరేంద్రను మద్యం పేరుతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి రాయితో దాడి చేసి హత్య చేశారని వెల్లడించారు.