కీరదోసను పండ్లు లేదా పాల ఉత్పత్తులతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి జీర్ణక్రియ వేగంలో తేడాల వల్ల గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట కీరదోస తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి, దీనిని మధ్యాహ్నం పూట విడిగా తీసుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.