WGL: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అక్కాచెల్లెళ్ళు 100% అటెండెన్స్ సాధించి ఔరా అనిపించారు. ఖిలా వరంగల్ మండలం శంభునిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న హసీనా (5వ తరగతి), ఫాతిమా (2వ తరగతి)లు పాఠశాల నడిచిన అన్ని రోజులు స్కూల్ కి హాజరయ్యారు. 220 పనిదినాల్లో 220 రోజులు వీరు పాఠశాలకు వచ్చారని ఉపాధ్యాయులు తెలిపారు.