SDPT: కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ కార్యదర్శి రవీందర్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో సర్పంచ్ పకిడే సంపత్ పాల్గొని మాట్లాడారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధిపై పలు తీర్మానాలు చేశారు.