AKP: అనకాపల్లి మండలం కొత్తూరు జడ్పీ హైస్కూల్లో అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, డా. అబ్దుల్ కలాం విగ్రహాలను టీడీపీ నాయకుడు దాడి రత్నాకర్ ఇవాళ ఆవిష్కరించారు. పాఠశాలలో జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటు హర్షణీయమని తెలిపారు. వీరిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని దేశసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.