అన్నమయ్య: రాయచోటి డివిజన్లో విద్యుత్ సమస్యలను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీసుకెళ్లారు. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటు, పాత విద్యుత్ నెట్వర్క్ పునర్వ్యవస్థీకరణకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వోల్టేజ్ మెరుగుదల, ప్రమాదాల నివారణకు ఇది అవసరమని తెలిపారు.