ADB: ఆదిలాబాద్ మండలంలోని అంకోలి గ్రామం నుంచి అంకాపూర్ వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు ఈ దారిలో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలన్నారు.