నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో ఓ మూవీ సిద్ధమవుతోంది. పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌తో రానున్న ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మే 1న జరిగే పూజా కార్యక్రమాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారట. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్. బాలయ్యను కొరటాల ఎలా చూపిస్తారో అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.