MDK: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రైవేట్ వాహనాలతో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్, ఐ.ఏ.ఎస్. తెలిపారు. అధిక ఛార్జీలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.