BDK: సమ్మె నేపథ్యంలో మణుగూరు ఆర్టీసీ అధికారులు శుక్రవారం ప్రత్యామ్నాయంగా ఔట్సోర్సింగ్ సిబ్బందితో సర్వీసులను నడుపుతున్నారు. ప్రభుత్వ ఉచిత ప్రయాణ పథకం యథావిధిగా కొనసాగుతుండటంతో మహిళలు, ఇతర ప్రయాణికులు ఇబ్బంది లేకుండా గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.