మరమరాలలో క్యాలరీలు చాలా తక్కువ. కప్పు మరమరాలు తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. డైటింగ్ చేసేవారికి ఇది మంచి చిరుతిండి. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. నీరసంగా ఉన్నప్పుడు కొద్దిగా మరమరాలు తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఔషధంలా పనిచేస్తాయి.