ATP: యల్లనూరు మండలం వెంకటాంపల్లి గ్రామంలో హనుమాన్ లక్ష్మణ సమేత సీతారాముల కల్యా ణం, ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమాలు మేలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మే 4న గంగపూజ, గనపతి పూజ, 5న ప్రాతఃకాల పూజ, వేదపారాయణం, దీక్షాహోమం, 6న యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, బండలాగుడు పోటీలు ఉంటాయన్నారు. భక్తులు హాజరై సీతారాముల కళ్యాణంలో పాల్గొనాలన్నారు.