TG: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై బీజేపీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని.. ఆర్టీసీ ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఎంపీ డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.