VSP: కైలాసగిరిపైన పర్యాటకులను ఆకట్టుకునేలా VMRDA ‘త్రిశూల్ ప్రాజెక్ట్’ చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా త్రిశూలం, డమరుకం నిర్మాణ పనులు చివరిదశకు వచ్చాయి. 65 అడుగుల ఎత్తుతో త్రిశూలం,18 అడుగుల వెడల్పుతో డమరుకం కలిపి భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో నుంచి కనిపించేలా ఎత్తయిన కొండపై దీనిని నిర్మిస్తున్నారు.