NZB: రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం డీఆర్డీవో సాయన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని జీపీ కార్యదర్శి మోహన్‌ను ఆదేశించారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలగంగాధర్, ఈజీఎస్ ఏపీవో రాజేశ్వర్, సర్పంచ్ శంకర్ ఉన్నారు.