NLG: గుర్రంపోడ్ వద్ద మొన్న జరిగిన ప్రమాదంలో కనగల్‌కు చెందిన నర్సింగ్ మధు గౌడ్, నర్సింగ్ ధనుంజయ్ గౌడ్ మృతి చెందారు. మృతదేహాలను శుక్రవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.