TG: ఖరీఫ్ 2026 సీజన్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మార్కెట్లో అధిక డిమాండ్, దిగుబడి ఉన్న BPT-5204, RNR-15048, HMT సోనా, KNM-1638 వంటి రకాలనే రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. గత ఏడాది తరహాలో మార్కెటింగ్ ఇబ్బందులు కలగకుండా, తక్కువ రకాలతో ఎక్కువ లాభం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.