TG: కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ ఒకప్పుడు చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. కానీ, ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పుటి కేసీఆర్ వేరు. ఆయన మనిషి కాదు.. మర మనిషిగా మారారు. గుంటనక్కలు, తోడేళ్ల చెరలో చిక్కిన బందీగా మారారు. తల్లిలాగా కాపాడుకోవాల్సిన కేసీఆర్ ఎక్కడ’ అని ప్రశ్నించారు.