JN: బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామంలో రెడ్డి సామాజిక భవన (కమ్యూనిటీ హాల్) నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి కొన్నే గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. రెడ్డి సంఘం నాయకులు, గ్రామస్తులు ఈరోజు ఎమ్మెల్యేను కలిసి, గ్రామంలోని సమస్యల గురించి వివరించారు.