SRPT: నడిగూడెం మండల కేంద్రంలో ఇవాళ గ్రామ సర్పంచ్ దున్న శ్రీనివాస్ పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన తన మార్నింగ్ వాకింగ్లో భాగంగా, సిబ్బంది గడ్డి మందు చల్లుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వార్డు సభ్యులు గుండు మహేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.