MHBD: జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు అడ్మిషన్ల టార్గెట్ పేరుతో విధించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యాలు విధిస్తున్న అసాధ్యమైన లక్ష్యాలతో వారు సతమతమవుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని నిబంధనలు విధించడమే ఇందుకు ప్రధాన కారణం.