సత్యసాయి: మంత్రి సత్యకుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నగదు వసూలు చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టాఫ్ నర్సు రమణమ్మను బదిలీ చేయిస్తామని నమ్మించి వేణు, శేషాద్రి అనే వ్యక్తులు ఆమె భర్త నుంచి రూ.లక్ష తీసుకున్నారు. మంత్రి పేరుతో నకిలీ లేఖను పంపి మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దిలీప్‌కుమార్ తెలిపారు.