ఎండ వల్ల కమిలిన చర్మానికి, అలసిన కళ్లకు గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. గ్రీన్ టీని ఐస్ ట్రేలో గడ్డకట్టించి ముఖానికి రాస్తే రక్తప్రసరణ పెరిగి తాజాగా మారుతుంది. కీరాదోస గుజ్జులో నిమ్మరసం, తేనె కలిపి ఐస్ క్యూబ్స్‌లా వాడితే చర్మం కాంతివంతమవుతుంది. కలబంద ముక్కలతో మర్దన చేస్తే వేడి తగ్గుతుంది. గులాబీ నీరు, కీరారసం కలిపిన ఐస్ ముక్కలు కళ్ల ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.