MDK: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి తండా బానోత్ సాయిప్రియ(17) టెన్త్ పరీక్షలు సరిగా రాయలేదని కొద్దిరోజులుగా దిగులుగా ఉంది. తల్లి ధైర్యం చెప్పినా వినకపోగా ఇవాళ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.