NLR: నగరంలోని జాతీయ రహదారిపై ఓ భారీ లారీ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. గతంలో ఇలానే సమీపంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద ఓ వాహనం దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని జాతీయ రహదారిపై ప్రమాదాలు నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.