TG: కరీంనగర్ జిల్లాకు చెందిన రవికుమార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన లలిత కొన్నేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్న చిన్న కారణాలతో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గొడవ పడుతూ.. వారి పిల్లలను PSలో వదిలి వెళ్లారు. ఇక లలిత ఓ పేపర్లో మెడలో ఉన్న తాలిబొట్టుతో పాటు మెట్టెలను కూడా వదిలేసింది.