KMM: రసాయనాలు లేని పండ్లతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా ఉద్యాన అధికారి వి. మధుసూదన్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం రోటరీ నగర్లోని వీధి వ్యాపారుల ప్రాంగణంలో రైతులు ఏర్పాటు చేసిన ‘కార్బైడ్ రహిత మామిడి పండ్ల మేళా’ ను ఆయన ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి అనిత శ్రీ, కార్పొరేటర్ మీరా పాల్గొన్నారు.