TPT: రైల్వే కోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లెలో ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం జాతర నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ కర్త హరిప్రసాద్ తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ జాతరలో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ ఉండనుందని చెప్పారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా.