AP: రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో చర్చించారు. పలు జిల్లాల్లో వాహనదారులు, రైతుల ఇబ్బందులపై ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు.