NGKL: సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు టీఎస్ యూటీఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపో వద్ద నిరసన చేపట్టిన కార్మికులను కలిసి సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు ఏపీ మల్లయ్య, నెహ్రూ ప్రసాద్ డిమాండ్ చేశారు.