అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. జూన్ 26న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం, ‘పెద్ది’ సినిమా జూన్ 25న రాబోతున్నట్లు వార్తలు రావడంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. నిర్మాత నాగవంశీ ఈ పోటీని నివారించేందుకు జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారానికి లెనిన్ విడుదలను మార్చాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.