ADB: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని వార్డ్ కౌన్సిలర్ పవర్ సూచిక మనోజ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్, రవీంద్ర నగర్ లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలో పిల్లల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.