MBNR: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో నూతన డ్రైనేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్ మమత డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి,డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్, నాయకులు చింతకింది శ్రీనివాస్ పాల్గొన్నారు.