MBNR: మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విద్యానిధి పథకానికి పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాల యాజమాన్యం లక్ష రూపాయలు విరాళాన్ని అందించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని వెల్లడించారు.