SRPT: రాజకీయ లబ్ధి కోసమే కాలేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చెడు ప్రచారం చేస్తుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరంపై ఘోష్ కమిటీ ఆరోపణలు చెల్లవని కోర్టు చెప్పడం రేవంత్ కి చెంపపెట్టు లాంటి సమాధానమన్నారు.