AKP: ఎన్నికల ముందు చంద్రబాబు 50 ఏళ్లు నిండిన బీసీలకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నక్కపల్లిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నరసింహమూర్తి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు జీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఈ హామీని నమ్మిన బీసీలందరూ టీడీపీకి ఓట్లు వేసినట్లు తెలిపారు.