BHPL: నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం MLA గండ్ర సత్యనారాయణ రావు విస్తృతంగా పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తారు. అనంతరం మొగుళ్లపల్లి (M) లోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.